Wednesday, July 30, 2008
నిరీక్షణం
నిశీధి వేళలో వేకువ కోసం వెతుకుతున్నా
చేజారిన స్వప్నం మెలుకువకి ఎదురవుతుందేమోనని !!
అలలై పొంగిన కన్నీటి చారికల వెంబడి పరిగెడుతున్నా
సంతత బాష్పబిందువుల కెరటాలు ముంచెత్తుతాయేమోనని !!
శిలలై, పెదవి దాటని మాటలకోసం తడుముకొంటున్నా
ప్రతిక్షణం నిరీక్షణంలో క్షణాలు యుగాలవుతాయేమోనని !!
కాలపు గమన గడియారం చేసే సవ్వడిని భరించలేకున్నా
ప్రతిఎడబాటు తీక్షణంలో నిముషాలు శరాఘాతాలు అవుతాయేమోనని !!
మిగిలిన జ్ఞాపకపు పుస్తకంలో ప్రతి పుటనీ వెతుకుతున్నా
ప్రతిఅక్షర వీక్షణంలో గుండెగదిలో ముద్రించుకొన్న పాదముద్రలు ఉన్నాయేమోనని !!
మసకబారిన కనులతో ఎదలో దాగిన ప్రతి ఉత్తరాన్నీ చదువుతున్నా
మిగిలిన శిలాక్షరాలు అంతం కాని శోకపు ఉప్పెనని నిలుపుతాయేమోనని!!
Subscribe to:
Post Comments (Atom)
15 comments:
fantastic.
very good images embedded.
you and pratap posses good vocabulary.
abhinandanalato
bolloju baba
అబ్బా ఎంత బాగా రాసావో,
"నిశీధి వేళలో వేకువ కోసం వెతుకుతున్నా
చేజారిన స్వప్నం మెలుకువకి ఎదురవుతుందేమోనని !!"
అస్సలు ఈ రెండు లైన్లు ఎంత బావున్నాయో.
"అంతం కాని శోకపు ఉప్పెన" ఎలా ఆగుతుందబ్బా? :-)
బాబా గారు,
మేమిద్దరం స్నేహితులం, కొద్దిగా దూరపు బంధువులం కూడా కావడం వల్ల మా ఇద్దరికీ ఇలా సాహిత్యపు పిచ్చి పట్టుకొందేమో. నేనేమో చిన్నప్పటి నుంచి తెలుగు మీడియం గాన్ని కాబట్టి నాకు తెలుగు కొంచెం వచ్చి ఉండటంలో అర్ధం ఉంది, కాని తను చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం ఆయినా ఇంత బాగా తెలుగు నేర్చుకొని ఉందంటే చాలా గ్రేట్ కదా?
chaalaa baagundi kala!
wonderful...
మొదటి, ఆఖరి చరణాలు చాలా బావున్నాయి :-)
"చేజారిన స్వప్నం మెలుకువకి ఎదురవుతుందేమోనని !!"
ఈ లైను ఛాలా బావుంది.
"ప్రతిఅక్షరపు వీక్షణంలో గుండెగదిలో ముద్రించుకొన్న పాదముద్రలు ఉన్నాయేమోనని !!"
ఈ లైను కూడా చాలా బావుంది గానీ గుండె గదిలో అన్న మాట అక్కడ అదనంగా ఉంది.
పద్యం మొత్తమ్మీద భావం మనసుని తాకేట్టుగా ఉన్నా, భాషా భేషజం ఎక్కువగానూ అన్వయం తక్కువగానూ అనిపిస్తోంది. అయినా కవిత్వం గురించి నాకేం తెలుసని చెప్పడానికొచ్చాను, నా పిచ్చి గానీ!
నాకు ఏదైనా బాగా నచ్చేస్తే.. అక్కడింక పదాల కోసం వెత్తుక్కోను.. అలా ఆనందించి వచ్చేస్తాను అంతే! మీ బ్లాగు కూడా ఆ కాటగిరిలోకి చేరేట్టుంది. చదివేసి.. నచ్చేసి.. "బావుంది", "సూపర్" లాంటి పదాలు నా మనసుతో సరితూగడం లేదు. అందుకే వ్యాఖ్యలు రాయ(లే)కపోవటం!!
వ్యాఖ్య లేనంత మాత్రాన.. నేను చదవలేదనీ.. చదివినా నచ్చలేదని.. అనుకోకండి. చక్కగా రాస్తున్నారు.. అలానే వీలైనంత వరకూ కొనసాగించండీ!!
అభినందనలు!!
పూర్ణిమ
చాలా బావుంది కల గారు, ఫొటో కూడా బాగా ఎన్నుకున్నారు.
బాబా గారు, ముందుగా thanx.
నాకు పెద్దగా తెలుగు రాదండీ, అయినా ఏదో నేర్చుకోవాలనే తపన ఉండబట్టి రాయాలనే ప్రయత్నం ఇది అంతే. ఎక్కడన్నా తప్పో, పోరబాటో చేస్తే మీ లాంటి, కొత్తపాళీ గారిలాంటి ఉద్దండులు సరిదిద్దగలరన్న ధైర్యంతో రాయగలుగుతున్నా.
ఇకపోతే దీనిలో వాడిన పదాలు మీరు ఇంతకు ముందు చూసే ఉంటారు. అవును మీరన్నది, అనుకొన్నది నిజమే, ఇవన్నీ నేను ప్రతాప్ బ్లాగులో చూసి, చదివి inspire ఆయి వాడిన పదాలే. అందుకు ముందుగా ప్రతాప్ కి కృతజ్ఞతలు చెప్పాలి.
మీ అభిమానం ఎల్లప్పుడూ ఇలానే కొనసాగాలని కోరుకుంటూ..
కల.
ప్రతాప్,
ముందుగా thanx.
అంతం కాని శోకపు ఉప్పెన ఆగదు, కాస్సేపైనా నిలవరింపబడుతుందేమో అని చిన్న ఆశ.
సపోర్ట్ కి కూడా thanx, కానీ నాకు తెలుగు మీ అందరి అంత బాగా రాదు, ఏదో మీ అభిమానం అంతే.
దిలీప్ గారికి, గిరీష్ గారికి,
నెనర్లు.
నిషి గారు మీ అంత బాగా రాద్దామని try చేశా. ఉహ్హూ అస్సలు రాలేదు, మీ అంత బాగా రాయలేనని అర్ధం అయి ఇక నా ప్రయత్నాన్ని విరమించేసుకొంటే ఇదిగో ఈ రూపంలో కవితగా బయటపడింది.
కొత్తపాళీ గారు ముందుగా నెనర్లు.
అదనం కోసమే అదనంగా ఆ పదాన్ని వాడవలసి వచ్చింది. భాషాభేషజం అంటారా, అది ఏదో కొంచెం తెలుగు నేర్చుకోవాలనే ప్రయత్నంలో ఇలా కొంచెం గ్రాంధికంగా ఉండే పదాలు ఎంచుకొన్నాను. అన్వయించుకోవడం అంటారా? అది చదివేవాళ్ళని బట్టి ఉంటుంది.
పూర్ణిమా,
ముందుగా ఇది చెప్పాలి లేకపొతే చెప్పాలనుకొన్నవన్నీ మర్చిపోతాను. అస్సలు ముందుగా మీ కామెంట్ చూడగానే ఎంత ఎనర్జీ వచ్చిందో తెలుసా. గబుక్కున మీరు రాసిన దాన్ని చదివే మిగతావి చదివాను.
మీరు చదివింది లేనిది నాకెలా తెలుస్తుంది? అలానే మీకు నచ్చింది లేనిది నాకెలా తెలుస్తుంది? అందుకే కామెంట్ పోస్ట్ చెయ్యాలి అంటాను నేను, నచ్చినా సరే, నచ్చక పోయినా సరే. ఇది నా ఆర్డరు. ఏమిటి ఈమేంటి? ఆర్డరేంటి? అని అనుకొంటున్నారా? పోనీ request అనుకోండి. plzzzzzzzzzzzzzzz.
@ శ్రీకాంత్ గారు thanx.
"తెలుగు నేర్చుకోవాలనే ప్రయత్నం" అన్నారు కాబట్టి కొన్ని చిన్న చిన్న సూచనలు.
"భాష్ప బిందువులు" కాదు "బాష్ప బిందువులు" ("బా"కి వత్తు ఉండదు).
సంస్కృతంనుంచి వచ్చిన రెండు పదాలు కలిసేటప్పుడు మధ్యలో "పు" రాదు.
ఉదాహరణకి "ప్రతిఅక్షరపు వీక్షణంలో" తప్పు, "ప్రతి అక్షర వీక్షణంలో" అని ఉండాలి. అందులో ఏ ఒక్కటి తెలుగుపదమైనా "పు"వస్తుంది, ఉదాహరణకి "శోకపు ఉప్పెన" సరైనదే.
చాలాచోట్ల ఈ పొరపాటు జరిగింది కాబట్టి ప్రత్యేకంగా చెపుతున్నాను.
మీ కవితలల్లో చక్కని చిత్రాలు కనిపిస్తున్నాయి. ప్రయత్నాన్ని ఇలాగే కొనసాగించండి!
భై.కా. గారు,
మీపేరు కుదించేశా పలకడానికి కాదు, టైపు చెయ్యడానికి వీలుంటుందని, ఏమీ అనుకోరుగా.
మీ విలువైన సూచనలకి ధన్యవాదాలు. మీరు చెప్పినట్లుగానే మార్చాను.
Post a Comment