Sunday, July 13, 2008
రహదారి
నేనెన్ని వంపులు తిరిగినా మీ ప్రయాణం నా మీదే..
నేనెన్ని మలుపులు తిరిగినా మీ పయనం నా మీదే..
నేనెన్ని రుధిరాక్షరాలు అద్దుకున్నా అది మీ నిర్లక్షం వల్లే..
నేనెన్ని భువనఘోషలు అందుకున్నా అది మీ ప్రారబ్ధం వల్లే..
కానీ మీకు తెలుసా?
నాపై జరిగిన ప్రమాదంలో,
ఆప్తులను కోల్పోయిన జనం రోదనను విని ఎంతగా తల్లడిల్లి పోతానో??
అశ్రుతర్పణం విడిచే దీనుల వేదనను కని ఎంతగా విలవిల్లాడిపోతానో??
కానీ మీకు తెలుసా?
నాపై జరిగిన ప్రమాదంలో,
ప్రాణాలని నిలుపుకోవడం కోసం మీరు పడే తపనను గాంచి ఎంతగా నలిగిపోతానో??
దీనంగా సాయం కోసం ఎదురుచూసే మిమ్ము చూసి ఎంతగా కుమిలిపోతానో??
ఇదంతా ఎవరి వల్ల?
నిర్లక్ష్యం నరనరాన జీర్ణించుకొన్న ఈ మురికికూపపు వ్యవస్థ వల్లా??
అవినీతి అణువణువునా పెనవేసుకొన్న ఈ అధికారులవల్లా?
ఇది నాకోసం, అది నీకోసం అంటూ వాటాలు పంచుకొనే కాంట్రాక్తర్లవల్లా??
లేక!!
ఈ వ్యవస్థలో సింహభాగం అయిన మీ అందరి వల్లా??
Subscribe to:
Post Comments (Atom)
5 comments:
ఇది చదవగానే.. నాకు మార్నింగ్ రాగా మూవీ కళ్ళముందు కదలాడుతుంది. ఒక వంతెన అందరి జీవితాలని ఛిన్నాభిన్నం చేయడం.. ఆహ్!!
మీరిలానే రాసేట్టు ఉన్నారు.. నేనూ కమ్మెంట్ చేయడానికైనా తెలుగు పదాలు ఇంకా నేర్చుకోవాలి. :-)
ఒక రోడ్డు పడే వేదనను నీ శైలిలో బాగా చెప్పావ్.
నువ్వు మొదట రాసిన కవిత చదివి, నువ్వు కూడా నాకిష్టమైన టాపిక్ (స్నేహం, ప్రేమ, విరహం వగైరా) మీద రాస్తావేమో అని భయపడ్డాను (competetion వస్తావేమో అనిలే).
కాని just 3 టపాలకే నీరాతల్లో చాలా ease కనిపిస్తోంది. ఇలానే సాగిపో..
wow చాలా బావుందండీ...
చాలా బాగా వ్రాస్తున్నారు.హృదయం ద్రవించినపుడే ఇటువంటి కవితలు పుడతాయి.
ఆదిలాబాద్ జిల్లాలో ఓ పెద్దాయన ఉన్నారండీ. పేరు గుర్తుకు రావడం లేదు. గొంగళి వేసుకుని స్టేజి మిద ప్రదర్శనలు ఇస్తుండగా చూశాను. ఆయన 'చీపురు' మీద అద్భుతమైన పాట రాశి పాడుతుంటారు.
మీ కవిత చదవగానే అది గుర్తుకొచ్చింది. లియో టాల్స్టాయ్ లాంటి గొప్ప రచయితలు తమ నవలల్లో ఓ సన్నివేశం గురించి రాసేటప్పుడు అక్కడ ఉన్న మనుషులతో పాటు వివిధ వస్తువులతో కూడా మాట్లాడిస్తారు. కుర్చీ, గోడ, ఫోటో, పటం, తలుపు, గడప ఇలాంటివంటివన్నమాట. సన్నివేశాన్ని పండించడానికి, పాఠకులకు అర్ధం చేయించి తన నవల్లోని సన్నివేశాల్లోకి లాక్కెళ్ళడానికి అవి చాలా అద్భుతంగా ఉపయోగపడతాయి.
రహదారిపై మీ కవిత చీపురుపై పాటనీ, టాల్స్టాయ్ నవల అన్నా కరేనినా I & II నీ గుర్తుకు తెచ్చాయి. శ్రీశ్రీ అన్నట్లు కాదేదీ కవితకనర్హం!
Post a Comment