Saturday, July 12, 2008

ఋతువు


శిశిరం మరవకంటూ పరుగెడింది..
నే కాచిన ఆశల ఆకులను కూల్చింది..
నే పూచిన కలల పువ్వులను రాల్చింది..

వసంతం వర వరా అడుగిడింది..
నా తనువుకు క్రొత్త చిగురును తొడిగింది..
నా పరవశాలకు క్రొంగొత్త వర్ణాలను అద్దింది..

గ్రీష్మం బిర బిరా ఆతెంచింది..
నా నీడన చేరిన జీవులకు ఊరటను ఇమ్మంది..
నా జాడన నడచిన జనులకు ఆరాటాన్ని తీర్చమంది..

వర్ష ఋతువు ఎదలోకి తొంగిచూసింది..
నా కన్నీటిని తనలో ఇముడ్చుకొని చినుకై కురిసింది..
నా ఆశలన్నింటిని తనలో కలుపుకొని వరదగా మారింది..

శరదృతువు వాకిలిలో నిలిచింది..
నా ఊహల చల్లని వెన్నెలను అందరికీ పంచింది..
నా మనస్సున మరుమల్లెలు విరబూయించింది..

హేమంతం నేనున్నానంటూ ఏతెంచింది..
నా చల్లని చూపుల హిమబిందువులని అందించింది..
నా ప్రాంగణంలో రంగవల్లుల అందెలు వేయించింది..

మరల శిశిరం ఏతెంచింది................

9 comments:

Purnima said...

Awesome!!

ఏతించింది అంటే తెలుసు.. ఆతించింది అంటే?? Just curious.

Srividya said...

చాలా బాగుంది.

మోహన said...

Beau(Du)tiful
వర్ష ఋతువు ఎదలోకి తొంగిచూసింది..
This line is too good.

ఏకాంతపు దిలీప్ said...

అందంగా ఉంది :-)

కల said...

@ పూర్ణిమా,
ముందుగా thanx. రెండూ ఒకటే.
@శ్రీవిద్య, మోహన, దిలీప్ మీ అందరికి కూడా thanx.

మీ అందరికీ ఒక విషయం చెప్పాలి.
ఈ కవిత ఒక చెట్టు యొక్క భావాలని ఉహించుకొని రాసాను.
అక్కడక్కడా నా భావాలు ఇరికించాను. వాటిని చూసి చూడనట్లు ఒదిలెయ్యగలరని ఆశిస్తున్నాను.

Purnima said...

Thanks for the clarification!!

మీనాక్షి said...

చాలా బావుంది....
చాలా బావుంది....
చాలా బావుంది...

Unknown said...

చాలా బాగుంది మీ కవిత.కవితను శిశిరంతో కాకుండా వసంతంతో మొదలెడితే ఇంకా బాగుండేదేమో. పరుగిడింది/పరుగెట్టింది .వర వరా అంటే?

కల said...

నరసింహ గారు ముందుగా thanx.
శిశిరంతో ఎందుకు మొదలెట్టాను అంటే, నిరాశావాదం నుంచి మొదలెట్టాలని,
హేమంతంతో ఎందుకు ముగించాను అంటే ఆశావాదం చూపెట్టాలని.
జీవితం ఆశ-నిరాశ ఇదో cycle కదా? అందుకని అలా cyclic గా రాసాను.
వర వరా అంటే వడి వడిగా అని.