Wednesday, July 16, 2008
నేను ఏకాంతంగా ఉన్నా!
నేను ఏకాంతంగా ఉన్నా!
ఒంటరితనం నను కబళించడానికి ప్రయత్నిస్తూ ఉన్నది.
కానీ నీ జ్ఞాపకాలని అడ్డుపెట్టుకొని నేను దానితో పోరాడుతున్నా!
నేను ఏకాంతంగా ఉన్నా!
నిర్వేదం నను ఆక్రమించడానికి ప్రయత్నిస్తూ ఉన్నది.
కానీ నీ ఛాయాచిత్రం వెనుకన ద్రాక్కొని నేను దానితో పోరాడుతున్నా!
నేను ఏకాంతంగా ఉన్నా!
నిర్లిప్తత నను అతిక్రమించడానికి ప్రయత్నిస్తూ ఉన్నది.
కానీ నీ మౌనం చాటున ఒదిగిన చిరునవ్వుల అస్త్రాలతో నేను దానితో పోరాడుతున్నా!
నేను ఏకాంతంగా ఉన్నా!
రక్తాశ్రపు కెరటం నను ముంచెత్తాలని ప్రయత్నిస్తూ ఉన్నది.
కానీ నీ కన్నుల మెరుపుల శత సహస్ర శస్త్రాలతో నేను దానితో పోరాడుతున్నా!
Subscribe to:
Post Comments (Atom)
8 comments:
ఫాంటాష్టిక్
ఇలా సైక్లికల్ గా వ్రాసే కవితలు చాలా లోతుగా గుచ్చుకుంటాయ్.
నిర్వేదం ఆక్రమించటం,
నిర్లిప్తత అతిక్రమించబూనటం
రక్తాశ్రపు కెరటం ముంచెత్తటం
ఎంత గొప్ప ఇమెజెస్ అండీ.
బాగా నచ్చిన కవిత, ఈ మద్య కాలంలో ఇదే.
చిన్న సందేహం
కొంచెం ఆశావహంగా ముగించవచ్చుగా
(నాలోని కవిగాడు ఎందుకు ముగించాలి అని ప్రశ్నిస్తున్నాడు)
సరదాగా
అభినందనలతో
బొల్లోజు బాబా
very very very very very very very nice one.Inkem cheppalo telleeledu.Keka anthe.
i got to spend some time with it.. to comment anything on what u've written!!
బాబా గారు మీరిచ్చే inspiration నాకు బాగా నచ్చుతుంది. అవతలి వాళ్ల లోని లోపాలు లేక తప్పులు కాని అతి సున్నితంగా చెప్పడంలో మీరు సిద్దహస్తులు. ఇలా అవతలి వారి భావాలని పూర్తిగా తెలుసుకొని అప్పుడు మన అభిప్రాయం చెప్పడం సరైనది అని నా ఫీలింగ్ కూడా. మిమ్మల్ని చూసి ఈ బ్లాగులోకంలోని critics అందరూ నేర్చుకోవాలి. ఇది నా ఫీలింగ్ మాత్రమే నండోయ్. ఎవ్వరినీ నొప్పించే ఉద్దేశ్యం నాకు లేదు.
నేను ఎంచుకొన్న అంశమే కొద్దిగా భాధాకరమైన అంశం కాబట్టి మీకు కొద్దిగా నిరాశావాదం కనిపించి ఉండొచ్చేమో. కాని కొద్దిగా తరచి చూస్తే దానిలో అంతా ఆశావాదమే. మరల ఇంకొక్కసారి కొద్దిగా ఆశావహదృక్పదంతో చదవ గలరని మనవి :-).
దీనిలోని ఆశావాదాన్ని ఎవరన్నా మీకు వివరించగలరేమో చూద్దాం లేకపొతే నేనే మీకు వివరిస్తాను.
క్రాంతి & శ్రీకాంత్ thanx.
పూర్ణిమా మీ అభిప్రాయం కోసం చంద్రునికోసం ఎదురుచూసే చకోరంలా మనస్సునంతా కళ్లు చేసుకొని ఎదురుచుస్తూ ఉంటాను :-). hey ఇప్పుడు రాసిన లైన్స్ లోని భావం బాగుంది కదా? దీని మీద ఇంకో కవిత రాయాలి.
నువ్వు చాలా బాగా రాస్తున్నావ్.
అన్ని పదాలు చాలా simple గా ఉన్నాయి, కానీ చెప్పలేని, చెప్పుకోలేని భావాలని అవి మోస్తున్నాయి.
బాబా గారు,
నాకీ కవితలో నిరాశావాదం ఏమి కనిపించడం లేదండి. పైపెచ్చు అంతా ఆశావాదమే కనిపిస్తోంది.
"ఏకాంతంలో ఉన్నా, ఒంటరిగా నున్నా, నేనెక్కడా ఉన్నా..
నన్ను కబలించేయ్యడానికి ప్రయత్నం చేస్తున్న అన్నింటినీ, అందరినీ నువ్వు ప్రసాదించిన ధైర్యంతో ఎదుర్కొంటున్నా. నువ్వు ఈ ప్రపంచంలో నా ప్రక్కన లేకున్నా పర్లేదు. కానీ నా మనోప్రపంచంలో ఉంటే చాలు" అన్న సందేశాన్ని ఈ కవిత ఇస్తోంది.
కలా, నీ wavelength ని catch చెయ్యగలిగానా?
ద్రాక్కొనిని--దాక్కొనిగా మారిస్తే బాగుంటుందేమో. రక్తాశ్రపు-అర్ధం కాలేదు.కొంచెం వివరించరూ.
probably you are right. kala, pratap. probably i could not convey my comment properly.
నా ఉద్దేశ్యం కవితను కొంచెం ఆశావహంగా అంటే ఎవరి గురించైతే ఈ కవిత వ్రాస్తున్నాడో ఆ వస్తువుకీ -కవికీ మధ్య (ఆ వస్తువు మనిషికావచ్చు లెక మరొకటి కావొచ్చు) కలయిక ని సూచనప్రాయంగా చెప్పి ముగించ వలసినది కదా అని.
మీరందరూ చెప్పినట్లుగా కవిత చివరి పాదం వరకూ ఆశావహంగానే ఉంది అందులో సందేహంలేదు.
ఒక రీడర్ గా ఒక రకమైన టెంపోలో పోయినపుడు అరరే వీరిద్దరూ కలిస్తే బాగుండునేంత కోరికకలిగేలా మీరు బలమైన చిత్రణ ఇచ్చేసారు. ముఖ్యంగా పదప్రయోగాలు.
అలా కాక నీవులెని విరహం నాకు తీయగానే ఉంది అని అనే రీతిలో సాగితే పెద్దగా సింపథీ కలగదు. ఇదీ నేను చెప్పదలచుకొన్న విషయం. ఇది ఆక్షణంలో నాకు కలిగిన భావన సుమా.
మీ వివరణ చదివిన తరువాత, నాకేమనిపిస్తుందంటే మీ కవిత ఉద్దే్శ్యం - ఒక తీవ్రమైన వేదన పాఠకునిలో రగిలించి వదిలివే్యటం ద్వారా రససిద్ధి కలిగించాలని ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అది కూడా మంచి విషయమే.
బహుసా అదే ఉన్నతమైనదేమో కూడా.
నా అభిప్రాయాలపై దాడి చేయకుండా గౌరవించినందుకు ధన్యవాదాలు.
నా పై మీ అభిప్రాయాలకు ధన్యుడను.
అభినందనలతో
బొల్లోజు బాబా
@నరసింహ గారు,
ద్రాక్కొని అన్నది సరైన పదం అని నేను భావించి అలా రాసాను. తప్పో ఒప్పో నాకు తెలీదు. కొద్దిగా verify చేసి చెబుతాను.
@బాబా గారు,
ఈ కవితకి అర్ధం దాదాపు ప్రతాప్ ఇచ్చేసారు. నేను చెప్పాలనుకొన్నది కూడా అదే. మీ interpretation శక్తితో నా కవితకి నాకు తెలియని ఇంకో అర్ధం చూపెట్టారు. అందుకు thanx.
నేను రాసే వన్నీ దాదాపు కొద్దిగా అసంపూర్తిగా ఉంటాయి. అలా రాయడమే నాకిష్టం కూడా.
నేను రాసే వాటిని చదివి (వీటిల్ని కవితలని అనొచ్చా?), వాటిని శల్య పరీక్షలకు గురిచెయ్యకుండా ఓపికగా, నన్ను నొప్పించకుడా మీ opinions తెలియచేసినందుకు ఇంకో thanx.
Post a Comment