Tuesday, August 19, 2008

ఆ నిమిషాన


ఆ క్షణాన, కనులు నేలపైకి వాలిపోయెనే,
ఆ క్షణాన, శ్వాస బరువై ఎద ఆగలేకపోయెనే,
ఆ క్షణాన, ధ్యాస కరువై మది తాళలేకపోయెనే,

ఆ సమయాన, ఉచ్ఛ్వాశ నిచ్ఛ్వాశ అదుపుతప్పెనే,
ఆ సమయాన, మౌనం మౌనంగా నన్నావరించెనే,
ఆ సమయాన, సన్నిధిలోని ఘడియలు క్షణాలయ్యెనే,

ఆ నిమిషాన, పాదం పదపదమంటూ తహతహలాడినే,
ఆ నిమిషాన, చిరుచెమటలు ముచ్చెమటులుగా మారినే,
ఆ నిమిషాన, అధరాలు వణికి, మాటల ద్రవ్యం తొణికెనే,

ఆ క్షణం కనులు కనులు కలిసి అనిమేషమైన వైనం.
ఆ సమయం మౌనం మౌనం మాట్లాడుకున్న తరుణం.
ఆ నిముషం రుధిరవర్ణాల అధరాలు కంపించిన విధం.

5 comments:

ప్రతాప్ said...

సూపర్ అని చెప్పలేను కానీ, సింపుల్ గా బావుంది.
కొన్ని లైన్స్ బావున్నాయి, "మౌనం మౌనం గా నన్నావరించేనే" అన్న వాక్యం చాలా బావుంది. అమ్మాయిలు ప్రతిఒక్కరూ ఇటువంటి సందర్భాన్ని పేస్ చేస్తారేమో కదా?

ప్రతాప్ said...

చెప్పడం మరిచాను, టైటిల్ విషయంలో కొంచెం అలోచించి ఉంటే బావుండేది అని నా అభిప్రాయం.

రాధిక said...

"అధరాలు వణికి, మాటల ద్రవ్యం తొణికెనే,
మౌనం మౌనం గా నన్నావరించేనే"
చాలా బావుంది.

నిషిగంధ said...

ప్రతాప్ గారి మాటే నా మాట :-) సింపుల్ గా బావుంది..

చైతన్య.ఎస్ said...

" మౌనం మౌనంగా నన్నావరించెనే.
మౌనం మౌనం మాట్లాడుకున్న తరుణం".
చాలా బాగుంది .