Friday, July 11, 2008

కాలం ఆగలేదు


కాలం ఆగలేదు.. కథ మారలేదు..
ఇలపై నే కన్న కలలన్నీ శిలలై పోయాయి..
జ్ఞాపకాలన్నీ రెప్పల మాటున దాగిపోయాయి..

కాలం ఆగలేదు.. కథ మారలేదు..
ఊహలన్నీ కనీనిక చాటున ఒదిగిపోయాయి..
ఊసులన్నీ గవనిక వెనుక పరుండిపోయాయి..

కాలం ఆగలేదు.. కథ మారలేదు..
ఏకాంతం ఆర్తిగా నను పెనవెసుకుంటూ ఉంటున్నది..
నీ నిరీక్షణం ఆశగా నను అల్లుకుంటూ ఉంటున్నది..
అయినా కాలం ఆగలేదు.. వ్యధ తీరలేదు..

14 comments:

ప్రపుల్ల చంద్ర said...

చాలా బాగుంది మీ కవిత.
టెంప్లేట్ కూడా చాలా బాగుంది.

మాలతి said...

చాలా బాగుంది కవిత. మధ్య మధ్యలో కాలం ఆగలేదు, కథ మారలేదు పాదం పునశ్సరణతో గేయలక్షణం కనిపిస్తోంది.
టెప్ ప్లేట్ కూడా చాలా చాలా బాగుంది. మీరే చేసారా

Bolloju Baba said...

కవిత చాలా బాగుంది.
మంచి వ్యక్తీకరణ.
కొన్ని పదాల అర్ధాలు తెలియలేదు. వీలైతే తెలుప గలరు.
1. కనీనిక
2. గవనిక

భావమైతే తెలుస్తోంది.
బొల్లోజు బాబా

కల said...

ప్రఫుల్ల గారికి, thulika గారికి thanx.
ఈ template ని తయారు చెయ్యడం కోసం, ఒక మిత్రుని సాయం తీసుకున్నాను.
అతనికి నా కృతజ్ఞతలు.

బాబా గారు,
కనీనిక అంటే కనురెప్ప.
గవనిక అంటే దాదాపు యవనిక అనే అనుకోవచ్చు.

నా కవిత, template మీ అందరికి నచ్చినందుకు thanx.

ప్రతాప్ said...

నీలో కూడా ఒక మంచి కవయిత్రి ఉందని నాకింత వరకు తెలియలేదు సుమా!!
బాగా రాసావు. చిన్న చిన్న పదాలతోనే ఒక కవితని అల్లేసావు. యవనికని గవనిక అని కుడా అనొచ్చని నాకింతవరకు తెలియదు.
చిన్న సవరణ. "కథ" అనుకుంటాను.

భావకుడన్ said...

కలగారు,

అంత మందికి నచ్చిన టెంప్లేట్ నాకు ఎందుకు ఇబ్బంది కలిగిస్తోందో నాకు తెలీదు. నా "సోడా బుడ్డి కళ్ళద్దాలు" కావచ్చు, కవిత చదవటానికి కష్ట పడాల్సి వచ్చింది ఆ రంగుల వలన--మాలాటి "చార్ కందిల్" గాళ్ళ కోసం మీ బ్లాగు background colour ని, font colour ని కొంచం సర్దే అవకాసం ఉందేమో చూడమని అభ్యర్ధన.

Purnima said...

"ఎవరండీ ఇక్కడ.. నా బ్లాగుకొచ్చి నా మీదే కాపీ కోట్టావ్ అంటూ నెపం వేసింది" అని అడిగేయాలని వచ్చాను. మీ టెంప్లేట్ చూడగానే.. "ఇది నాదే" అన్న ఫీలింగ్.. నా బ్లాగు మొదట్లో ఈ టెంప్లేట్ లోనే ఉండేది. చదవడానికి కష్టమవుతుందని అంతా అంటే.. మార్చాల్సివచ్చింది.

ఊహలతో బ్లాగు రాయాలి అనిపించకపోతే.. నేను ఎంచుమించు బ్లాగు శీర్షికా.. ఉపశీర్షికా మీరు రాసినట్టే ఉండేది. వర్షం అంటే ఎందుకు ఇష్టమూ అని అడిగితే.. ఏడ్చినా ఎవరికీ తెలియదు కదా అనే బాపతు నాది. మీ కన్నీటి అలలు.. అందుకు సరిగ్గా సరిపోయేట్టున్నాయి.

ఇక ఎందులో తేడా అంటే మాత్రం.. మీ అంత బాగా రాయలేను..అంతే!! మీ కవితలో ఉన్న భావన నాకు స్వానుభవమే.. కానీ అంత అందంగా పదాలలో కూర్చలేను.

ఇప్పుడు అర్ధమైయ్యిందా?? నేను కాపీ ఏలా కొట్టేసానో!! ;-)

I'm delighted to meet u!! :-)

వేణూశ్రీకాంత్ said...

మీ కవిత చాలా బావుందండి కనీనిక, గవనిక నాకూ కొత్తే, మీరు అర్ధం చెప్పాక కవిత ఇంకా బావుందనిపించింది.
టెంప్లేట్ చూడటానికి చాలా బావుందండీ కానీ చదవడానికే కొంచెం ఇబ్బంది గా ఉంది font shades ఇంకొంచెం contrast ఉండేలా మారిస్తే కేక పుట్టిస్తుంది....

భావకుడన్ said...

అడిగిన వెంటనే మార్చినందుకు కృతజ్ఞతలు.నాకు నచ్చిన బ్లాగుల లిస్టులో చేరిపోయారు. బ్లాగ్లోకానికి స్వాగతం.

కల said...

@ప్రతాప్,
నువ్వు చెప్పింది నిజమే. అది "కథ" నే. కాకపొతే తెలుగు రైటింగ్ softwares అంతగా తెలియక పోవడం వల్ల అలా వచ్చింది.

@భావకుడన్ గారు,
తప్పకుండా. తొందరలోనే ఒక రోజు మీరిచ్చిన సలహాలకోసం కేటాయిస్తాను.

@పూర్ణిమా,
మీరేంటి? రాయలేక పోవడం ఏంటి? ఈ టెంప్లేట్ నాకు విపరీతంగా నచ్చి వాడేసాను. నా బ్లాగు టైటిల్ కి, థీమ్ కి కూడా సరిపోతుందని. కన్నీటి అలలు అంటే trazedic గా తీసుకోవద్దు. మనకే ఫీలింగ్ వచ్చినా (అది మనస్సును కదిలించేది అయితేనే) మనల్ని ముందర పలకరించేది ఆ కన్నీళ్ళే. వర్షం అంటే నాకు బాగా ఇష్టం. ఎందుకంటే, నా మాటల చినుకులన్నీ కవిత అనే వరదగా మారేట్టు, నా అనుభూతుల చిరు జల్లులన్నీ, మదిన తొలకరి జల్లుని కురిపించేలా చేసేదీ వర్షమే. సంతోషమైనా కన్నీరు వర్షంలానే పొంగుటుంది నాకు, భాధైనా కూడా కన్నీటి వర్షంలా మారుతుంది నాకు. అందుకే నాకు వర్షం అంటే చచ్చేంత ఇష్టం.
మీరు కాపీ కొట్టలేదు. మీరు రాసినవి దాదాపు అందరి స్వానుభవాలే. కాకపోతే నేను కాస్త సరదాగా అలా అన్నా. lite తీస్కోండి.

వేణు శ్రీకాంత్ గారు,
ముందుగా thanx. మీరు చెప్పినట్లు అందరికి comfortable గా ఉండేట్టు మార్చే దానికి ప్రయత్నిస్తాను.

Purnima said...

కన్నీళ్ళు .. nothing but tragic అంటే నేనొప్పుకోను.. ఇంద ఈ లంకె చూడండి..

http://myimpressions-purnima.blogspot.com/2007/07/gala-gala-paruthunna-godaari-laa.html

This is how I value tears!!

Light తీసేస్తున్నానండీ.. Global Warming kadaa!! ;-)

కల said...

పూర్ణిమా మీ పై వాఖ్య చదివి నేనలా అనుకొన్నందుకు సారీ.
కాని మీ కన్నీళ్ళ టపా అదుర్స్.
కన్నీళ్ళని ఒక్కసారి కూడా కార్చని వారు మనష్యులు కానే కారని నా అభిప్రాయం.

మీనాక్షి said...

చాలా బాగుంది మీ కవిత..
టెంప్లెట్ కూడా..తెగ నచ్చేసిందోచ్.....
నాకు...మీను

MURALI said...

కవిత చాలా బాగుంది.